![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 55 లో.. సీతాకాంత్ పెళ్ళి చేసుకున్నాడని వాళ్ళ అమ్మ శ్రీలత బాధపడుతుంది. తన సొంత కొడుకు సందీప్ తో ఆ పెళ్ళి వల్ల జరిగే నష్టాలని చెప్తుంటుంది. ఈ ఆస్తి , మనం అనుభవిస్తున్న ఐశ్వర్యం అన్నీ సీతాకాంత్ కష్టార్జితమని శ్రీలత అనగానే.. అదేంటి మమ్మీ.. అన్నయ్య మమ్మల్ని సొంత తమ్ముడు, సొంత చెల్లి కంటే ఎక్కువగా చేసుకుంటున్నాడు కదా .. అలా ఆలోచిస్తాడంటావా అని సందీప్ అంటాడు. ఇక మీద నుండి ఆలోచిస్తాడు. ఇప్పటిదాకా నా మాట వినేలా చేసుకున్నాను. కానీ నాకు తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నానని , అసలు వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నారా.. లేక నటిస్తున్నారా తెలుసుకోవాలి కాదు తెలుసుకుంటానని సందీప్ తో శ్రీలత అంటుంది.
మరోవైపు రామలక్ష్మి తన ఇంట్లో ఉండి ఆలోచిస్తుంటుంది. వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలన్నీ, అదేవిధంగా సీతాకాంత్ , అభిలతో రామలక్ష్మి మాట్లాడిన మాటలన్నీ గుర్తుకుచేసుకుంటుంది. మనం అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలని రామలక్ష్మితో సీతాకాంత్ అనగానే అభి, రామలక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు. అదేంటి సర్ అలా మాట్లాడుతున్నారని రామలక్ష్మి అడుగగా.. మనం పెళ్ళి చేసుకున్నట్టు అందరిని నమ్ముంచాలి.. ముందుగా మీ నాన్న మాణిక్యాన్ని నమ్మించాలని సీతాకాంత్ అంటాడు. నాకర్థం కావట్లేదని రామలక్ష్మి అడుగగా.. మనం పెళ్ళి చేసుకోవట్లేదని, నటించాలని సీతాకాంత్ చెప్తాడు. నేను ఒప్పుకోనని అభి అంటాడు. దాంతో ఓ అగ్రిమెంట్ ని సీతాకాంత్ తీసుకొచ్చి అభి, రామలక్ష్మిలకి ఇస్తాడు. మీ అమ్మ ట్రీట్ మెంట్ కి, నీకు ఫారెన్ లో జాబ్ కోసం, ఇంకా మీ ఖర్చులన్నీ నేను భరిస్తానని సీతాకాంత్ మాటిస్తాడు. దాంతో ఈ పెళ్ళి నాటకానికి అభి ఒప్పుకుంటాడు. కానీ రామలక్ష్మి ఒప్పుకోకపోవడంతో మనకి వేరే దారి లేదని సీతాకాంత్ అన్నాక.. బాగా ఆలోచించిన రామలక్ష్మి.. సిరి, ధనల పెళ్ళి కోసం ఒప్పుకుంటుంది.
ఇక అప్పుడే రామలక్ష్మి దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి.. నిన్ను బలవంతం చేసి ఆ సీతాకాంత్ చేసుకున్నాడని తెలుస్తుందని రామలక్ష్మి వాళ్ఖ అమ్మ సుజాత అనగానే.. అదేం లేదమ్మ నా ఇష్టంతోనే చేసుకున్నాను. ఎవరు నన్ను బలవంతం చేయలేదని రామలక్ష్మి అనగానే.. నిన్ను బాగా కొట్టాలని ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి నా చేయిదాటిపోయిందని సుజాత అంటుంది. ఇక వాళ్ళ సుజాతని కౌగిలించుకొని రామలక్ష్మి ఏడుస్తుంది. ఆ తర్వాత మాణిక్యం పూలగంపతో ఇంటికొస్తాడు. ఆ గదిలోకి తీసుకెళ్ళి డెకరేట్ చేయు అలాగే రామలక్ష్మిని కూడా రెడీ చేయమని, స్వీట్స్ మర్చిపోయానని తీసుకురావడానికి వెళ్తున్నానని మాణిక్యం అనగానే.. ఈ పూలెందుకని సుజాత అడుగుతుంది. పెళ్ళి తర్వాత మొదటి రాత్రి తంతు ఉంటదని తెలియదా అని మాణిక్యం అనగానే.. సుజాత, రామలక్ష్మి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |